నాన్నా

నీ చేతులతొ వెలిగించిన ఈ జ్యోతి కి
నువ్వే స్పూర్తి
నిన్ను ఎంతగా నిర్వచించినా
అవి అనిర్వచనీయలే
ఏ ఉపమానం చెప్పినా
అవి అర్ధరహితాలే
ఎంతగా నిన్ను వర్ణించినా
అవి అస్పస్టభావాలే
అసంపూర్ణ భావాలే
నీ అనురాగానికి సరి సమానంగా
ఈ సృష్టి లో ఏవి సరి తూగలేవని
మనస్పుర్తిగా ఒక్క మాట చెప్పాలని వుంది

ఓ మనసా



మనసా ఎందుకే ఈ ఆనందం
ఏమిటీ ఈ తెలియని అమాయకత్వం
ఏ మదికి అర్ధమగునొ నీ మనస్తత్వం

ప్రతీ క్షణం పరుగులుతీస్తావు
ఎప్పుడూ అలోచనలు చేస్తావు
నా కంటికి ఎన్నడూ కానరావు
తుదకు ఎవరొ మదిన కొలువుంటావు

మనసా ప్రేమంటే తెలుసుకో
జీవితాన్ని అందంగా మలుచుకో
మదిలోని భవాలను అర్ధం చేసుకో
నీకు నచ్చిన వారి హృదయాన నిలిచిపో
నీ మది మెచ్చిన వారి ప్రేమను ఎపటికైనా అందుకో..

నా చెలి

తన సుమధుర దరహాసంతో - తొలిచూపులోనే నా మది దోచిన
తన రూపం ఈ సృష్టి కే ప్రతిరూపం

తన పెదవులపై చిరునవ్వు ఓ అందమైన గులాబీ పువ్వు
నవరసభరితమైన తన ముఖ సౌందర్యం వర్ణనాతీతం

తనే నా హృదయ రాణి - తనే నా ప్రేమ వాణి
తను లేని జీవితం నరకం - తనే నా జీవిత మారకం

తను ఎన్నటికైన వస్తుందని - నా ఆశ ఫలిస్తుందని
ప్రతి నిమిషం ఒక యుగంలా - గడుపుతున్న ఈ ప్రేమికుడిని కరునించవా ఇకనైన

ఇంకా నడుస్తున్న...


అంత దూరం నడిస్తే...

గతం గుర్తొస్తే...

తిరిగి వెనక చూస్తే...

ఎన్ని సంఘటనలు....ఎన్ని ఊహలు...

ముందు చూస్తే...

ఇంక చాలా దూరం నడవాలి..

జీవితం లొ ఎన్నో గెలవాలి..

ఆ ఆనందం పొందాలి...

నాలొ నేను



ఆగని కన్నీరు
గుండె చెరువు చేస్తుంది..
ఆ బాధ నీతో చెప్పాలని ఉన్నా
గొంతు అడ్దుపడుతుంది..
తడికన్నుల చెమ్మ
మనసు తలుపులు మూసింది
నువ్వు ఉన్నావనుకున్నా..
నీ మౌనం నన్ను ఒంటరిని చేసింది ..!!

ఒక ఆకు రాలుతూ

ఒక ఆకు రాలుతూ చెప్పింది
ఈ జీవితం శాశ్వతం కాదు అని
ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది
జీవించేది ఒక రోజు ఐనా గౌరవంగా జీవించమని
ఒక మేఘం వర్షిస్తూ చెప్పింది
తనలాగే మంచిని చేయమని
ఒక మెరుపు మెరుస్తూ చెప్పింది
ఉండేది క్షణ మైనా ఉజ్వలంగా ఉండమని
ఒక కొవ్వత్తి కరుగుతూ చెప్పింది
తను కష్టాల్లో ఉన్నా ఇతరులకు సుఖాన్ని ఇవ్వమని
ఒక యేరు జల జల పారుతూ చెప్పింది
తనలాగే కష్టా సుఖాల్లో చలించకుండా సాగమని
ఒక జాబిలి వెలుగుతూ చెప్పింది
తనలాగే జీవితాంతం ఎదుటి వారిలో వెలుగుని నింపమని...

జీవిత0

ఈ రంగుల లోకంలో
నావన్నీ నల్లని అనుభవాలు
కనుల కాగితం పై
కలల కావ్యాలకి బదులు కన్నీటి చిత్రాలు...

వదిలి పోయిన సున్నిత త్వం
కౌగిలించుకున్న కర్కసత్వం
నేను కాదనుకున్న కలివిడితనం
నన్ను కాదనుకున్న ఆనందం

నాలొని నన్ను చంపుకుంటూ
నన్ను నేను మార్చుకుంటూ....వెళ్ళాల్సిన
తీరం కనిపించని దూరం లో గమ్యం
కన్నవాళ్ళను వదిలి
స్నేహాలను మరచి
డాలర్ల లో వెతుక్కొవాల్సిన సంతోషం

నేనంటూ మిగిలి లేని
నాదంటూ ఏమిలేని
నాకంటూ ఎవరూ వుండకూడని జీవితం

పెళ్ళి కి అర్ధం ఇప్పుడు తెలిసింది
"నువ్వు కాని నువ్వు
నీది కాని జీవితం"

కాలం

గడియారం నుండి జారిపోతున్న ప్రతీ క్షణాన్ని
ఒడిసి పట్టి గుండెల్లో బంధించేస్తున్నాను -అనుభూతుల రూపం లో
ప్రతీ క్షణం వెళుతూ వెళుతూ తన
విలువను పెంచుకుంటోంది -గతమై
మిగిలినేడు లో మరణించింది... అయినా
నిన్న లో కుడా గొప్ప గా బ్రతికేస్తుంది -చరిత్ర లా

ఎర్ర గులాబి



ఏ ప్రియుడి చేతిలో చేరి
ఏ చెలియ అలుక తీర్చాలా అని..
ఏ కన్నె సిగలో చేరి ఎన్ని వగలు చూపాలా అని..
ఎన్ని హ్రుదయాల మూగ భావాలు
ప్రేమగా మలచి వివరించాలా అని..
ఆలోచిస్తూ అందంగా ముస్తాబై
మంచు ముత్యాల చెక్కిలిగిలికి
చిలిపిగా సిగ్గుపడుతూ
చేరుకోబోయే చేతుల కోసం నిరీక్షిస్తూ...ఓ ఎర్ర గులాబి

వెయ్యి వసంతాలు


వెయ్యి వసంతాలు వచ్చిన....స్వర్గం సోయగం తెచ్చినా...
ఆ అందం నాకవసరం లేదు....నీ నవ్వు చాలు......
లక్ష నక్షత్రాలు దిగి వచ్చినా...కలల కాంతులు తెచ్చిన...
ఆ తేజస్సు నాకవసరం లేదు....నీ మొముచుస్తే చాలు....
కోటి ఆదృస్టాలు కలసి వచ్చి... వరం కొరుకొమంటె...
మన స్నేహన్ని విడదీయొద్దని అడుగుతా....నా ఊపిరి ఆగిపొయిన...
నా శ్వాస గాలిలో కలసి పొయినా...నేను భూమి మీద లేక పొయినా...
నీ స్వరూపాన్ని చెదరనీయను...నీ నీడనై నేనుంటా