ఒక ఆకు రాలుతూ

ఒక ఆకు రాలుతూ చెప్పింది
ఈ జీవితం శాశ్వతం కాదు అని
ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది
జీవించేది ఒక రోజు ఐనా గౌరవంగా జీవించమని
ఒక మేఘం వర్షిస్తూ చెప్పింది
తనలాగే మంచిని చేయమని
ఒక మెరుపు మెరుస్తూ చెప్పింది
ఉండేది క్షణ మైనా ఉజ్వలంగా ఉండమని
ఒక కొవ్వత్తి కరుగుతూ చెప్పింది
తను కష్టాల్లో ఉన్నా ఇతరులకు సుఖాన్ని ఇవ్వమని
ఒక యేరు జల జల పారుతూ చెప్పింది
తనలాగే కష్టా సుఖాల్లో చలించకుండా సాగమని
ఒక జాబిలి వెలుగుతూ చెప్పింది
తనలాగే జీవితాంతం ఎదుటి వారిలో వెలుగుని నింపమని...

జీవిత0

ఈ రంగుల లోకంలో
నావన్నీ నల్లని అనుభవాలు
కనుల కాగితం పై
కలల కావ్యాలకి బదులు కన్నీటి చిత్రాలు...

వదిలి పోయిన సున్నిత త్వం
కౌగిలించుకున్న కర్కసత్వం
నేను కాదనుకున్న కలివిడితనం
నన్ను కాదనుకున్న ఆనందం

నాలొని నన్ను చంపుకుంటూ
నన్ను నేను మార్చుకుంటూ....వెళ్ళాల్సిన
తీరం కనిపించని దూరం లో గమ్యం
కన్నవాళ్ళను వదిలి
స్నేహాలను మరచి
డాలర్ల లో వెతుక్కొవాల్సిన సంతోషం

నేనంటూ మిగిలి లేని
నాదంటూ ఏమిలేని
నాకంటూ ఎవరూ వుండకూడని జీవితం

పెళ్ళి కి అర్ధం ఇప్పుడు తెలిసింది
"నువ్వు కాని నువ్వు
నీది కాని జీవితం"

కాలం

గడియారం నుండి జారిపోతున్న ప్రతీ క్షణాన్ని
ఒడిసి పట్టి గుండెల్లో బంధించేస్తున్నాను -అనుభూతుల రూపం లో
ప్రతీ క్షణం వెళుతూ వెళుతూ తన
విలువను పెంచుకుంటోంది -గతమై
మిగిలినేడు లో మరణించింది... అయినా
నిన్న లో కుడా గొప్ప గా బ్రతికేస్తుంది -చరిత్ర లా

ఎర్ర గులాబి



ఏ ప్రియుడి చేతిలో చేరి
ఏ చెలియ అలుక తీర్చాలా అని..
ఏ కన్నె సిగలో చేరి ఎన్ని వగలు చూపాలా అని..
ఎన్ని హ్రుదయాల మూగ భావాలు
ప్రేమగా మలచి వివరించాలా అని..
ఆలోచిస్తూ అందంగా ముస్తాబై
మంచు ముత్యాల చెక్కిలిగిలికి
చిలిపిగా సిగ్గుపడుతూ
చేరుకోబోయే చేతుల కోసం నిరీక్షిస్తూ...ఓ ఎర్ర గులాబి

వెయ్యి వసంతాలు


వెయ్యి వసంతాలు వచ్చిన....స్వర్గం సోయగం తెచ్చినా...
ఆ అందం నాకవసరం లేదు....నీ నవ్వు చాలు......
లక్ష నక్షత్రాలు దిగి వచ్చినా...కలల కాంతులు తెచ్చిన...
ఆ తేజస్సు నాకవసరం లేదు....నీ మొముచుస్తే చాలు....
కోటి ఆదృస్టాలు కలసి వచ్చి... వరం కొరుకొమంటె...
మన స్నేహన్ని విడదీయొద్దని అడుగుతా....నా ఊపిరి ఆగిపొయిన...
నా శ్వాస గాలిలో కలసి పొయినా...నేను భూమి మీద లేక పొయినా...
నీ స్వరూపాన్ని చెదరనీయను...నీ నీడనై నేనుంటా

స్నేహం


కలల ప్రయాణం మెలుకవ వరుకే
అలల ప్రయాణం తీరం వరుకే
ప్రేమ ప్రయాణం పెళ్ళి వరుకే
స్నేహం ప్రయాణం జీవితాంతం వరుకు

హృదయం

నీ చుట్టూ కటిక చీకటి

అనుక్షణం స్పందించే గోడలు

ప్రవహిస్తున్న ఎర్రని రక్తం ఉందని

ఏ మత్రం భయపడవద్దు

నీవు సురక్షితమైన ప్రదేశంలోనే వున్నావు

అది నా హృదయం

ఆశయం


నేటి రాత్రి ఎంతటి చీకటిదైన
రేపటి వేకువ రెక్కలకు చీలక మానదు కాన
పయనించి ఒటమి మెట్ల పైన
చేరుకోవాలి మన ఆశల మేన

ప్రేమంటే?

ఫూలన్నవి పూయకపొతె మొక్కకు అందం లేదు

ప్రేమన్నది విరియకపొతే మనసుకు అర్థం లేదు

బ్రతుకే వ్యర్థం కాదు!

చివురించిన వసంతంలొ చిగురాకుల గుండెల్లో

చినుకుల చిరుజల్లు కై ఆలపన ప్రేమ

గుబురైన పొదల్లో వికసించిన పూయదల్లొ తుమ్మెద కై తపనే ప్రేమ
విరియని కలువ కనుల్లొ చంద్రుడి కై ఆవేదన ప్రేమ
విరిసిన కమలం హ్రుది లొ సుర్యుడి కై ఆవేదన ప్రేమ

తొలి చినుకుల సవ్వడి


నీలి మబ్బుల చాటున దాగిన చిరు చినుకుల అందం
నిండు వేసవిలో కురిసిన జల్లులకు పులకరించిన
నేల తల్లి సుమ గంధం
వానలో తడుస్తూ హాయిని అనుభవించి
రాగాలు తీసే కొకిల స్వర గానం
తడిమిన ప్రతి చినుకులో మాధుర్యం
ఫ్రక్రుతి ఒడిలో నెను తన్మయం చెందిన వైనం
వర్ణనాతీతం,సుమధురం అనుభవం.

చెలి


మైమరిపించె కురులు
విసాలమైన కనులు
పండులాంటి బుగ్గలు
తెనేలూరె పెదాలు పాలరాతి పరువాలు
సన్ననైన నడుము
ఆందలన్ని ఎకమైన రూపమా
మది లోని గేయమ

గుండె గోపురం




నా మనసులొ దాగి వుంది నీవు కదా
నా గుండె గొపురంలొ నిండి వుంది నీవు కదా
నే కన్న కల నీవు కదా
నా ప్రతి స్పర్సలొ నీ అలజడి కదా
నే ప్రతి పూట జపించేది నీ పేరు కదా
నే పీల్చె ప్రతి స్వాస నిన్ను తాకిన గాలే కదా
కనులు మూసిన నీ రూపమె కదా
కనులు తెరిచిన నీ రూపమె కదా అనుక్షనం నీ గ్నపకమె కదా

ఫ్రియురాలి హ్రుదయం

సాగరం ఎంత లొతుందొ ఎవరికి తెలుసు
నేలను తాకి దాగుదె ముత్యపు చిప్పకు తప్ప
ప్రియురాలి హ్రుదయంలొ ఎముందొ ఎవరికి తెలుసు
ప్రేమ అంచుల్ని స్ప్రుసించే ప్రెమికునికి తప్ప.