తొలి చినుకుల సవ్వడి


నీలి మబ్బుల చాటున దాగిన చిరు చినుకుల అందం
నిండు వేసవిలో కురిసిన జల్లులకు పులకరించిన
నేల తల్లి సుమ గంధం
వానలో తడుస్తూ హాయిని అనుభవించి
రాగాలు తీసే కొకిల స్వర గానం
తడిమిన ప్రతి చినుకులో మాధుర్యం
ఫ్రక్రుతి ఒడిలో నెను తన్మయం చెందిన వైనం
వర్ణనాతీతం,సుమధురం అనుభవం.

No comments: